![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-7 లో ప్రస్తుతం టాప్-6 లో ఉన్న హౌస్ మేట్స్ జర్నీ వీడియోలు ప్లే చేస్తున్నాడు బిగ్ బాస్. ఇది చూసి ఎంతోమంది కనెక్ట్ అవుతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్-7 కి బజ్ ఇంటర్వ్యూ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న గీతు రాయల్.. ఈ జర్నీ వీడియోలు చూస్తూ ఎమోషనల్ అవుతుంది.
గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున.
ఇక గీతు రాయల్ ఎలిమినేషన్ చూసి అందరు ఎమోషనల్ అయ్యారు. అయితే గీతు టాప్-5 లో ఉండకుండానే బయటకు వచ్చేసింది. దాంతో ప్రస్తుతం టాప్-6 లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం సాగుతున్న జర్నీ వీడియోలని చూసి ఎమోషనల్ అవుతుంది. దాని గురించి తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది గీతు. అందులో ఏం ఉందంటే.. " అందరి టాప్-5 జర్నీ చూస్తుంటే నేను చాలా మిస్ అయిపోయా అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకో.. నా డ్రీమ్ ఒకప్పుడు అట్ల గార్డెన్ ఏరియాలో నిల్చున్నప్పుడు బిగ్ బాస్ నా గురించి మాట్లాడితే వినాలని, ఒక 20 మినట్స్ 'AV' చూసుకోవాలని, అందరి ఫోటోస్ తీసుకెళ్ళాలని, మాఇంటి నిండా ఆ ఫోటోలని ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవాలని ఉంది. కలలు కల్లోలం అయినప్పుడు హృదయం గాయపడుతుంది.. కన్నీళ్ళుగా మిగిలిపోతుంది" అంటూ గీతు ఎమోషనల్ వర్డ్స్ రాసుకొచ్చింది. కాగా ఇప్పుడు ఇది ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.
![]() |
![]() |